కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు..

by Sumithra |
కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు..
X

దిశ, తిమ్మాపూర్ : వచ్చే ఎన్నికల్లో గెలవమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి పాల్పడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ఎమ్మెల్యే పై దాడికి యత్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు.

దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది చూపించాలని అన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మూడో సారి భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని జ్యోస్యం చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతియుతంగా ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజానికి భయపడేది లేదని, మరోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కాబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story