రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాములే...

by S Gopi |
రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాములే...
X

దిశ, హుజూరాబాద్: రాష్ట్రంలో ఎక్కడ చుసినా స్కామ్ లేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హథ్ సే హథ్ జోడో కార్యక్రమంలో భాగంగా శాలపల్లి-ఇందిరానగర్ లో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగుర్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హథ్ సే హథ్ జోడో పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందముందని, ఇందుకు నిదర్శనం కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడమేనన్నారు. ప్రజాసమస్యలపై ఈటల రోడ్డెక్కి పోరాడింది లేదన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల అక్రమాలకూ పాల్పడ్డారని విమర్శించారు. గవర్నర్ కోటాలో తిరస్కరించిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి మానేరు వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టారన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నదనే సమాచారంతో డంపింగ్ నిలిపి వేశారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా పెరిగిపోయినా ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గానీ చోద్యం చూస్తున్నారన్నారు. పరాకాష్టకు చేరిన కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటలపై వారు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed