కాంగ్రెస్ చేతల ప్రభుత్వం.. ఇచ్చిన మాట తప్పదు..: జీవన్ రెడ్డి

by Aamani |
కాంగ్రెస్  చేతల ప్రభుత్వం.. ఇచ్చిన మాట తప్పదు..:  జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి అమలు చేయడంతో పాటుగా నవ వధువుకు తులం బంగారం కూడా అందజేస్తామని మాట ఇచ్చాము. అంటే అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ అంటేనే చేతల పార్టీ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బాలిక సంరక్షణ పథకం కింద ఇచ్చే రెండు లక్షల పథకాన్ని రద్దు చేసి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామని బి ఆర్ ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అని ఎద్దేవా చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి చేశామో ప్రజలకి వివరిస్తామని బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అమలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తూ సీఎం సహాయ నిధి ఇస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు జగిత్యాల పట్టణాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేశామని అసలు జగిత్యాల అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీ అని పార్టీ అధికారంలోకి రాగానే తై బజార్ పన్ను రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు.గృహ లక్ష్మి పథకం కింద బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం మంజూరు పత్రాలు మాత్రమే ఇస్తుందని కానీ ఆ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అమలు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story