- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వసతి గృహాల ఆధునీకరణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
దిశ, పెద్దపల్లి: ఈ నెల 20వ తేది నాటికి సుల్తానాబాద్ మండలంలో చేపట్టిన ఎస్సీ బాలుర వసతి గృహం ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని ఎస్సీ బాలుర వసతి గృహం ఆధునీకరణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. జిల్లాలో ఉన్న 9 షెడ్యూల్ కులాల వసతి గృహాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం ప్రతి హాస్టల్ కు రూ. 5 లక్షల చొప్పున గతంలో రూ. 45 లక్షలు మంజూరు చేసిందని, వాటిలో నుంచి ఇప్పటివరకు 6 షెడ్యూల్ కులాల వసతి గృహాల పనులు పూర్తి చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కూ వివరించారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న 3 షెడ్యూల్ కులాల వసతి గృహాల ఆధునీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, హాస్టల్స్ లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అవసరమైన విద్యుత్ మరమ్మత్తులు వంటి సదుపాయాలు కల్పిస్తూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో శశికళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.