హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..

by Satheesh |   ( Updated:2022-11-23 14:07:49.0  )
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు పెంచాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆరోగ్యశ్రీ విభాగం, ఒపి, ఆపరేషన్ థియేటర్లను సందర్శించి ఆసుపత్రిలోని వసతులు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో చేపట్టిన అతిథి గృహ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

ఆసుపత్రి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకువాలని డాక్టర్లు, వైద్య సిబ్బందికి సూచించారు. వీలైనన్ని ఎక్కువ నార్మల్ డెలివరీలు అయ్యేలా కృషి చేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి హుజూరాబాద్ ఆసుపత్రికి మంచి పేరు తీసుకు రావాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్, డాక్టర్ సుజన్ కుమార్, డాక్టర్ నమిత తదితర సిబ్బందికి సూచించారు,

Advertisement

Next Story