- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Sandeep Kumar Jha : విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లాలోని కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆఫీస్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, ఎందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారని, 25 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈరోజు హెచ్ఎం సెలవులో ఉన్నారని, 13 మంది విద్యార్థులు స్కూల్ కి వచ్చారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయుడు తీసుకెళ్లారు.
అనంతరం మధ్యాహ్నం భోజనం తయారు చేసే గదిని పరిశీలించి, నిర్వాహకురాలితో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. గదిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపై అవగాహన వచ్చేలా బోధించాలని, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చదవడం, రాయడం, మ్యాథ్స్, ఇంగ్లీష్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పాఠశాల ఉపాధ్యాయుడు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.