దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

by Shiva |
దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
X

అమర వీరులకు నివాళులర్పించిన నాయకులు

దిశ, మానకొండూర్: దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఉద్యమానికి తోడుగా తన పాటతో పోరాటాన్ని మరింత ఉధృతం చేశామంటూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి రథ సారధి చైర్మన్ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తుచేసుకున్నారు. మంగళవారం మానకొండూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలోని, మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో, పార్టీ ఆవిర్భావ వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించి, పార్టీ జెండాలు ఆవిష్కరించి మానకొండూరులో నిర్వహించిన రసమయి ఆత్మీయ సమ్మేళనానికి, ఆరు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘ నాయకులు తరలివచ్చారు. మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో చెరువు కట్ట నుంచి ఆత్మీయ సమ్మెళన వేదిక వరకు ఎమ్మెల్యే రసమయికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, భారీ ఎత్తున హాజరై ర్యాలీలో పాల్గొని పూల వర్షాన్ని కురిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధన కోసం 25 ఏళ్ల క్రితం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం కేసీఆర్ మాటే తన పాటగా రూపొందించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story