పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Shiva |
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్: పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మంగపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 360 సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కొన్నేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో లో వోల్టేజీతో పండిన పంటలు ఎండిపోయేవని తెలిపారు. దీంతో చాలా మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని తెలిపారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిపాలనలో 24 ఉచిత విద్యుత్ తో సాగునీరు అందుతోందని, పంటల పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు. రైతుకు భీమా చేయించిన ఘనత కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతోందన్నారు. మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి, 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న సీఎం కేసీఆర్ పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రూ.12లక్షల కోట్ల అప్పులు చేసి ఆ భారం ప్రజలపై మోపిందని ఆరోపించారు.

ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 80శాతం ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాన్నారు. నియోజకవర్గంలో 90 శాతం రోడ్లు పూర్తయ్యాయని తెలిపారు.

అదేవిధంగా రూ.120 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ సంపత్ యాదవ్, జడ్పీటీసీ వంగాల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ కుమార్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు కుమార్ యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు మానస, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed