- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసిఆర్ పేదోళ్ల దేవుడు : రామగుండం ఎమ్మెల్యే
దిశ, గోదావరిఖని: పేదోళ్ల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల దేవుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అభివర్ణించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్గాం మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ గారు పేదింటి యువతి పెళ్ళి కానుకగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, నిరుపేదల కుటుంబంలో వెలుగులు నింపారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయనడంలో అతిశయోక్తి లేదన్నారు.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు రైతుబంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల కరెంటు తదితర పథకాలను సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నాయా? అని ప్రజలు ఆయా పార్టీల నాయకులను ప్రశ్నించాలని సూచించారు. సీఎం కేసీఆర్ గారితోనే తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వందేళ్ళ అభివృద్ధిని సాధించిందని, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి, హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ ను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. అనంతరం 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంగ పిండి సతీష్, నాయకులు కుర్ర నూకరాజు, అర్శనపల్లి శ్రీనివాస్, ఎదులాపురం వెంకటేష్, పిల్లి రమేష్, దాసరి శ్రీనివాస్, అల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.