- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ టీఆర్ఎస్ లో చేరతానని ప్రాధేయపడ్డారు ..సర్దార్ రవీందర్ సింగ్
దిశ,కరీంనగర్ : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ కాంట్రవర్సీ వర్డ్స్ తో పతాక శీర్షికలో ఉండాలన్న బండి ఆలోచన సరికాదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న మూడు సీట్లు కూడా రావని అన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ప్రచారంకు వెళ్లిన బండి సంజయ్ కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గూర్చి బండికి చెప్తూ రివర్స్ అటాక్ చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కొరకు కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చావో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని నన్ను ప్రాదేయపడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజకీయాలలోకి కుటుంబ సభ్యులను లాగడం విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని బండి సంజయ్ ప్రచారం చేశాడని ఆరోపించారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఎక్కువ శాతం తెలంగాణకే వస్తున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని హితువు పలికారు. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.