- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా.. చల్మెడ
దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వేములవాడ ప్రాంతం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు, మరి ఎవరికైనా టికెట్ ఇస్తే తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. దాదాపు 500 మంది కార్యకర్తలు అభిమానుల మధ్య కార్యాలయం ప్రారంభించారు. ముందుగా నాయకులు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవచేయడం కోసం చల్మెడ లక్ష్మీనరసింహారావు కార్యాలయాన్ని ప్రారంభించినట్లుగా వెల్లడించారు.
చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా మరింత సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తనను కలువవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు ఏఎంసీ చైర్మన్ ప్రభాకర్ రావు, సహకార సంఘాల అధ్యక్షులు బండ నరసయ్య యాదవ్, జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, మాజీ జెడ్పిచైర్మన్ తీగల రవీందర్ గౌడ్, మాదాడి గజానంద రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లైసెట్టి మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.