ఆల్మస్ పూర్ లో దొంగల హల్ చల్..

by Sumithra |
ఆల్మస్ పూర్ లో దొంగల హల్ చల్..
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మస్ పూర్ లో సోమవారం అర్ధరాత్రి రెండు ఇండ్లలో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉచ్చిడి పద్మ ఇంట్లో తాళం పగలగొట్టి బీరువా నుండి 15 వేల నగదును అపహరించుకుపోయారు. అదే గ్రామంలో కిషన్ రెడ్డి ఇంట్లో దొంగలు పడి ల్యాప్ టాప్, గడియారం ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ఇండ్లను స్థానిక ఎస్సై రమాకాంత్ పరిశీలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story