సిరిసిల్లలో బీఎస్పీ బైక్ ర్యాలీ

by S Gopi |   ( Updated:2023-01-13 14:37:26.0  )
సిరిసిల్లలో బీఎస్పీ బైక్ ర్యాలీ
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో యుపీ మాజీ సీఎం, మాయావతి జన్మదినం సందర్భంగా సిరిసిల్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి మాయావతికి శుభాకాంక్షలు తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు స్వామిగౌడ్ మాట్లాడుతూ మాయావతి తన హయాంలో లక్షల ఎకరాల భూమిని భూమి లేని ఎందరో నిరుపేదలకు పంచి పెట్టారని, కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా పథకాలు ఉంటాయని, దానికోసం ప్రజలందరూ బీఎస్పీ పార్టీని ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు బొడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, సిరిసిల్ల జిల్లా కన్వీనర్ సగ్గుపాటి నరేష్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపెల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాటి పెల్లి అంజయ్య, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ అన్నల్ దాస్ బాను, సిరిసిల్ల నియోజకవర్గ బీవీఎఫ్ కన్వీనర్ కొలపురం సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story