- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRSV : కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డ బీఆర్ఎస్వీ నాయకులు..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో స్థానిక బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్ పేల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అస్వస్థకు గురై అనుమానస్పదంగా మరణించారని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా గురుకులాల వసతి గృహాలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికీ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని, జిల్లాలోని మర్రిమడ్ల గ్రామానికి చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఎడ్యుల అనిరుద్ కూడా అనుమానాస్పదంగా మరణించాడన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి కారణమైన అధికారుల ఉద్యోగాలను తొలగించాలని, వారి మరణాల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి మరణానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని భారత రాష్ట్రసమితి విద్యార్థి విభాగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, జిల్లా నాయకులు కోడం వెంకటేష్, వావిలాల సాయి, కోడి రోహిత్, మూడం సాయి, అరవింద్, కస్తూరి సాయి, తదితరులు పాల్గొన్నారు.