- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ మట్టి తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. మహమ్మద్ అంకుస్
దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాల వారీగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సుంకే రవిశంకర్, అధికారుల సాక్షిగా బీఆర్ఎస్ కార్యకర్తలు సొంత పార్టీ నేతపైన దాడికి తెగబడ్డారు. ఆయన చేయి విరిచారు. ఈ దాడిని బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకుస్, అధికార పార్టీకి చెందిన మైనారిటీ నాయకులు మాజీద్, నోమన్, అసీఫ్, వాజీద్, తీవ్రంగా ఖండించారు.
బుధవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో వారు జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షుక్రుద్దిన్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల ఆకస్మిక దాడితో బీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షుక్రుద్దిన్ సొంత పార్టీ కార్యకర్తల దాడితో ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు. గ్రామంలోని పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా అంశాన్ని ప్రశ్నించినందుకే పార్టీ నేత వీర్ల వెంకటేశ్వరరావు ప్రోద్బలంతో కట్ల అనిల్, రమేష్, తిరుపతి, లంక మల్లేశం, ప్రశాంత్, ప్రవీణ్ కుమార్, సురేష్ తదితరులు షుక్రుద్దిన్ పై దాడి చేశారని వారు చెప్పారు. ఈ మేరకు రామడుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామంలోని పెద్ద చెరువులో 3, 300 క్యూబిక్ మీటర్ల మట్టి తీసేందుకు చలాన్ కట్టి, ఇప్పటి వరకు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమ రవాణా చేశారని వారు ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే గ్రామంతో నీకేం పని అంటూ షుక్రుద్దిన్ పై దాడికి తెగబడ్డారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడికి, ప్రజాప్రతినిధికి భద్రత లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పై దాడి చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకొని పక్షంలో మైనారిటీలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ ఉంటుందని తాము భావించడం లేదన్నారు. షుక్రుద్దిన్ గత 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారని, ఆ సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించిందన్నారు. అయితే స్థానిక నాయకులకు మైనార్టీలు కళ్ళకు కనిపించడం లేదని విమర్శించారు. ఈ విషయమై తాము సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. చొప్పదండిలో దాడుల సంస్కృతికి తెరతీస్తున్న వీర్ల వెంకటేశ్వరరావు పై పార్టీ పరంగా చర్య తీసుకోవాలని, ఆయనను పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.