Collector : ప్రతిబిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం.. కలెక్టర్ పమేల సత్పతి..

by Sumithra |
Collector : ప్రతిబిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం.. కలెక్టర్ పమేల సత్పతి..
X

దిశ, రామడుగు : పుట్టిన ప్రతిబిడ్డకు తల్లిపాలు అందించడం చాలా శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. ఈ సందర్భంగా రామడుగు మండలం వెదిర అంగన్వాడి సెంటర్ ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిబిడ్డకు తల్లిపాలు అందించడంలో చొరవ చూపాలని పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తుందని మహిళలనుదేశించి మాట్లాడారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మిస్తుందని బిడ్డ కోసమైన తల్లి పోషకాహాల పదార్థాలు తీసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీ నెలకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేపించుకొని డాక్టర్ సలహాలు పాటించాలని అన్నారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు లేకుండా నార్మల్ అంటే ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కూడా పాటించాలని సూచించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన ప్రతిగర్భిణీ తల్లికి మగబిడ్డకు పన్నెండు వేల రూపాయలు ఆడ కూతురికి పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల తహశీల్దార్ బి.భాస్కర్ ఎంపీడీవో రాజేశ్వరితో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



Next Story