- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె లిక్కర్ బోర్డు తెస్తే.. నేను పసుపు బోర్డు తెచ్చా: Mp Aravind
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ సెటైర్లు వేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన తెలంగాణకు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ బోర్డు తెస్తే తాను పసుపు బోర్డు తీసుకువచ్చానని సెటైర్లు వేశారు. పసుపు సనాతన ధర్మమని, పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కవిత తనను అందుకోలేరని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల్లాగా కబ్జాలు చేయనని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లంచాలు తీసుకోనని చెప్పారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడనని, అలాంటి మచ్చ తనపై ఉండదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే దళారీ వ్యవస్థను పొంచి పోషిందని చెప్పారు. ముత్యంపేట షుగర్ ప్యాక్టరీని తెరిపిస్తానని చెప్పారు. మళ్లీ రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇందూర్ పార్లమెంట్ లో 7 సీట్లు గెలిపించాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరోటి లేదన్నారు. నవంబర్ 30న రాష్ట్రంలో బీఆర్ఎస్ పీడ విరిగిపోతుందని ఎంపీ అర్వింద్ విమర్శించారు.