కేటీఆర్ కాన్వాయ్ పై నల్ల బెలూన్లు విసిరిన బీజేపీ నాయకురాలు

by Shiva |
కేటీఆర్ కాన్వాయ్ పై నల్ల బెలూన్లు విసిరిన బీజేపీ నాయకురాలు
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై ఓ మహిళ బీజేపీ నాయకురాలు బ్లాక్ బెలూన్లు విసిరింది. సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో తన కారులో వచ్చిన బీజేపీ నాయకురాలు ఏకంగా పరుగులు తీస్తూ కేటీఆర్ కాన్వాయ్ పై బెలూన్ విసిరింది. కమాన్‌పూర్ మండలానికి చెందిన జనగామ సుజశ్రీ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు విసిరినట్లు సమాచారం. కెమెరాల్లో బంధించిన ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్ అయింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, కేటీఆర్ కాన్వాయ్ పై బెలూన్లతో నిరసన వ్యక్తం చేయడం భద్రత వైఫల్యమేనని నేటిజన్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story