- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం: నాగరాజు
దిశ, శంకరపట్నం: దేశ సంక్షేమ కోసం ప్రజా సంక్షేమం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ 18 గంటలు శ్రమిస్తున్నాడని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు అన్నారు. శనివారం శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో ప్రజాగోష బీజేపీ భరోసా యాత్ర, కార్నర్ బహిరంగ సభ శక్తి కేంద్రం ఇంచార్జ్ దండు కొమురయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ బహిరంగ సభకు నాగరాజు ముఖ్యఅతిథిగా నాగరాజు హాజరై మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ సంక్షేమం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం 18 గంటల శ్రమించి ప్రధానిగా సేవలందిస్తున్నాడని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ పేద బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏర్పడుతుందని, తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్య బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జపాల్, అంతం రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసా రాపు నరేందర్, మండల ఉపాధ్యక్షులు పెసర వీరా అర్జున్, జానపట్ల రాజిరెడ్డి, మండల కార్యదర్శి దాసరి సంపత్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బిజిలి సారయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కనకం సాగర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గౌరవేణి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు అన్నాడి మహేందర్ రెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి, బూత్ అధ్యక్షులు రమేష్,శంకర్, రవి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.