వీధుల్లో బీజేపీ కౌన్సిలర్ల భిక్షాటన..

by Sumithra |   ( Updated:2023-06-21 09:03:54.0  )
వీధుల్లో బీజేపీ కౌన్సిలర్ల భిక్షాటన..
X

దిశ, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని పలు వీధుల్లో బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు బుధవారం బిక్షాటన చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ దాసరి సునీత రాజశేఖర్ మాట్లాడుతూ వర్షాకాలంలో కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు ద్వారా 10, 11వ వార్డుల్లో వరద నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మురికి కాలువ నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదన్నారు.

గత కొన్ని ఏళ్లుగా వర్షాకాలంలో కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు నుండి వరద నీరు పట్టణంలోని 10, 11వ వార్డులలో చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 10, 11వ వార్డుల ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాడవేని నరేష్, పెండెం గణేష్, మొలుమూరి అలేఖ్య మురళి, నాయకులు ఇందూరి తిరుమల వాసు, జక్కుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story