ప్రతిఒక్కరూ బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి..

by Sumithra |
ప్రతిఒక్కరూ బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని ఆర్డీఓ, జిల్లా ఇంచార్జీ రెవెన్యూ అధికారి టి శ్రీనివాస్ రావు కొనియాడారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం మహాత్మా బసవేశ్వరుని 890 వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఐడీఓసీలో బసవేశ్వర చిత్రపటానికి ఆర్డీఓ, ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి డీబీసీడీఓ, డీపీఆర్ఓ స్థానిక తహశీల్దార్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అందరి హృదయాల్లో బసవేశ్వరుడు చిరస్థాయిగా నిలిచిపోతారని ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా సమసమాజ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కృషి చేశారన్నారు.

ఆ కాలంలోనే మహిళా సాధికారత కోసం పాటుపడిన మహోన్నతులు బసవేశ్వరుడని ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడు అని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బసవేశ్వరుని ఆచరణలు నేటికీ కొనసాగడం సంతోషకరమని, ఆయన చూపిన అడుగు జాడల్లో ప్రజలందరూ పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, తహశీల్దార్ విజయ్ కుమార్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు కాకరకాయల మంజుల, ఉపాధ్యక్షులు కే శివప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఎస్.చంద్రమౌళి శీల గంగాధర్, మహిళా సంఘం అధ్యక్షురాలు శీల అరుణ, ఎస్.చంద్రకళ, ఉమ, అనూష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed