- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెస్ ఎన్నికల రీ కౌంటింగ్.. Bandi Sanjay రియాక్షన్ ఇదే!
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల సెస్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ, మళ్లీ రీకౌంటింగ్ చేయడంతో ఫలితాలను తారు మారు చేస్తారా? అని బండి సంజయ్ మండిపడ్డారు. సెస్ ను నాశనం చేసిన బీఆర్ఎస్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారని సీఎంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎసోళ్లే ఓట్లేసుకుంటున్నారు.. వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని విమర్శించారు.
ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు అని ఫైర అయ్యారు. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉంది కదా ఇష్టానుసారం వ్యవహరిస్తారా?, టీఆర్ఎస్ నేతల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవు, ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లమనిపించేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : గట్టి పోటీనిచ్చిన BJP.. చతికిలపడ్డ కాంగ్రెస్.. ''సెస్'' ఎన్నికల్లో సీన్ రివర్స్!