- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
దిశ, గోదావరిఖని: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరుగబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. సోమవారం బండి సంజయ్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కాంగ్రెస్ పార్టీ డ్రామా అని అన్నారు. కేసీఆర్‌వి అన్నీ నక్కజిత్తుల రాజకీయాలని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో రెండు తోడు దొంగలేనని, కాదంటే... ఫోన్ టాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటకు వచ్చిన కూడా ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద అవినీతి అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవినీతికి పాల్పడిన ఒక్కరిని కూడా ఇప్పటివరకు జైలుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలను నమ్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌ను అరెస్టు చేయబోతున్నదని ఊకదంపుడు ప్రచారం చేస్తే.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్ద మనుషులను కలిసి లాబీయింగ్ చేసుకొని వచ్చాడని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఆరు నూరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని, తాము అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను తప్పక శిక్షిస్తామని అన్నారు. ఇంత తక్కువ సమయంలోనే ప్రజల వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ధ్వజమెత్తారు.