- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలోనే కేటీఆర్, హరీష్‌రావు బండారం బట్టబయలు : Bandi Sanjay
దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో సాగుతున్న బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న కోతల రాయుడు జగిత్యాలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మొరిగాడని కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 మంది పేదలు చనిపోతే ముఖ్యమంత్రి హోదాలో కనీసం వారిని పరామర్శించడానికి కూడా రాలేదని పేదోళ్ల పాపం ఊరికే పోదని లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిన ముఖ్యమంత్రి బిడ్డ కవిత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. లిక్కర్ క్యాసినో దందాలలో కవిత పెట్టుబడులు పెట్టిందని నాన్నకు తగిన బిడ్డ దొరికింది అని కేసీఆర్ సంబరపడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఫ్యాక్టరీ తెరిపించడం చేతకాదని సీఎం రాసిస్తే మోడీని తీసుకువచ్చి 250 కోట్ల రూపాయలతో తాను ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు.
గల్ఫ్ కార్మికులు పంపిన డబ్బుతో ఉద్యమం చేసిన సీఎం కేసీఆర్ ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్ళిన వాళ్లను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విదేశాల్లో మరణించిన వాళ్లను ఇండియాకు రప్పించే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆలయాల అభివృద్ధి వట్టిమాటే..
జగిత్యాల పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కొండగట్టుకు ఘాట్ రోడ్డు వేయడానికి చేతగాని సీఎం కొండగట్టును ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. బాసర ఆలయ అభివృద్ధికి 120 కోట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొహం చాటేసాడని ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. రాష్ట్రంలో ఏ ఆలయమైన అభివృద్ధి చెందాలంటే ముందుగా కేసీఆర్ బినామీలు ఆలయాల దగ్గర భూములు కొన్నాకనే అభివృద్ధి జరుగుతుందని లేకపోతే జరగదని గతంలో వేములవాడ ఆలయానికి కేటాయించిన నిధులను కూడా కేసీఆర్ డైవర్ట్ చేశాడని తెలిపారు.
Also Read: తెలంగాణలోనూ గుజరాత్ ఫలితాలే రిపీట్?