ఇద్దరూ భూకబ్జాదారులే.. వీళ్లలో ఎవరు గెలిచినా మీ ఇండ్లను కబ్జా చేస్తారు : బండి సంజయ్

by Vinod kumar |   ( Updated:2023-11-19 14:06:10.0  )
ఇద్దరూ భూకబ్జాదారులే.. వీళ్లలో ఎవరు గెలిచినా మీ ఇండ్లను కబ్జా చేస్తారు : బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: దేశంలోనే మహాచోర్ కేసీఆర్.. రాష్ట్రంలోనే బడా చోర్ గంగులని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ అన్నారు. చింతకుంటలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. భూకబ్జాలు, కమీషన్ల దందాతో వేల కోట్లు దండుకున్న గంగులని.. భూకబ్జాలు తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బాధలేం తెలుసు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్న వడ్లు, బియ్యం టెండర్లలో ఈ ఒక్క ఏడాది రూ.1300 కోట్లు గోల్ మాల్ చేసి తెలంగాణను ముంచిన అవినీతిపరుడు గంగుల. భూకబ్జాలు, గ్రానైట్ గుట్టలను మాయం చేసి కమీషన్లు దండుకున్న గంగుల నాపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. నేను మీకోసం కొట్లాడితే నాకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు.. మీకు రేషన్ కార్డుల కోసం కొట్లాడిన. మీకు ఇండ్ల కావాలని కొట్లాడిన.

మీ పిల్లలకు ఉద్యోగాల కోసం కొట్లాడి జైలుకు పోయిన. రైతుల కోసం లాఠీదెబ్బలు తిన్న.. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు మీకోసం ఎన్నడైనా కొట్లాడారా? ఇద్దరూ భూకబ్జాదారులే వీళ్లలో ఎవరు గెలిచినా మీ ఇండ్లను కబ్జా చేసినా ఆశ్చర్యం లేదన్నారు. నేనడుగుతున్న రేషన్ మంత్రి గంగుల కమలాకరే కదా మీకు ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరిదీ జాగల పంచాయతీ. భూకబ్జాల్లో పోటీపడుతున్నరు. వీళ్లకు పోరాటాలు తెలియవు. ప్రజలకు మేలు చేయడం తెల్వదు. ఏ వార్డులో, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నదో కూడా తెల్వవు. అట్లాంటోళ్లకు ఓట్లేస్తే మీ బతుకులు బర్ బాదే.. ప్రజలారా.. ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాను.

Advertisement

Next Story

Most Viewed