- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజన్న సన్నిధిలో బలగం దర్శకుడు వేణు
by Shiva |

X
దిశ, కోనరావుపేట: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని మంగళవారం బలగం డైరెక్టర్ ఎల్లండి వేణు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజన్నకి కోడె మొక్కు కట్టేసి చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేణుకు అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఏఈవో బి.శ్రీనివాస్ ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. దర్శకుడు వేణును రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుల చంద్ర శేఖర్ శాలువతో సత్కరించి అభినందించారు.
Next Story