మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...

by Sumithra |   ( Updated:2023-04-23 11:52:30.0  )
మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...
X

దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం, మెట్ పల్లి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 1990/1991 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని మాడ మహేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించగా పూర్వ విద్యార్థులు హాజరై పూర్వ గురువులను, ప్రస్తుత గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వoగళ సరోజన, ఎంపీటీసీ కొయ్యడ శోభ రాణి కుమార్ యాదవ్, పూర్వ గురువులు, ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story