- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిర్మాణం ఆపకపోతే కలెక్టర్, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం: ఏఐఎస్ఎఫ్
దిశ, సైదాపూర్: సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరెంట్ సబ్ స్టేషన్‌ను నిర్మాణం చేపట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి రామారపు వెంకటేష్, జిల్లా నాయకులు కేశబోయిన రాము పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థులకు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తహశీల్దార్ సబ్ స్టేషన్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం ఏంటని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహారించడం సరైనది కాదని.. తక్షణమే రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి ఈ నిర్మాణాన్ని నిలిపివేయాన్నారు. లేదంటే.. ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఏస్ఎఫ్ నాయకులు చందు నాయక్, అనిల్ కుమార్, సాయికృష్ణ, అఖిల్, మణికంఠ, వంశీ, పవణ్, తదితరులు పాల్గొన్నారు.