రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

by Shiva |
రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
X

పది రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తాం

దిశ, జగిత్యాల రూరల్ : ధాన్యం తరలింపులో రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని అన్నారు. రూరల్ మండలంలోని వ్యవసాయ మార్కెట్లో పాక్స్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొట్ట మొదటగా చల్ గల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామిని తెలిపారు. ఇక్కడ పది రోజుల్లోగా వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందన్నారు.

రాష్ట్రంలో మూడు రెట్లు వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ధాన్యాన్ని తూర్పార బట్టి ఇస్తే ఒక్క కిలో కట్ కాకుండా చూస్తామన్నారు. ఆ సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ప్రతిపక్షాలు మాటలు ఫోటోలకే పరిమితమని అన్నారు. పని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దాదాపు 34 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రలు కొనసాగుతున్నాయన్నారు.

రైతుల ముసుగులో రాజకీయాలు చేసే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చల్ గల్ మార్కెట్ రైతులకు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, పాక్స్ చైర్మెన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, ఏఎంసీ డైరెక్టర్ ఆనంద్ రావు, ఎంపీటీసీ దమ్మా మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed