HD company : కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

by Sumithra |
HD company : కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలతో చెలగాటం..
X

దిశ, రామగిరి : రామగుండం 3 ఏరియా ఓసీపీ 1లో కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఓబీ (మట్టి తరలింపు) పనులు నిర్వహిస్తున్న హెచ్డీ కంపెనీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం బ్లాస్టింగ్ హోల్స్ లో మందు నింపుతుండగా ప్రమాదం తలెత్తడంతో రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ఆడెపు శ్రీకాంత్ రెండు కళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం బయటకు పొక్కకుండా యాజమాన్యం బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఓసీ1 చేరుకుని నిరసన చేపట్టారు. కార్మికుడు ఆడేపు శ్రీకాంత్ కు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు కోలుకునే వరకు పూర్తివైద్యం అందించాలన్నారు. అంతే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్డీ కంపెనీ పైన కేసునమోదు చేయాలని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.



Next Story