కాంగ్రెస్ పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి.. కందుల సంధ్యారాణి

by Sumithra |   ( Updated:2023-12-01 08:08:31.0  )
కాంగ్రెస్ పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి.. కందుల సంధ్యారాణి
X

దిశ, గోదావరిఖని : ఎన్నికల సమయం ముగిసి కనీసం అరగంట కూడా గడవక ముందే 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో తాము గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కాంగ్రెస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్నికల ముగింపు సమయంలో ఈవీఎంలు భద్రపరిచి వాటిని తరలించక ముందే తామే గెలిచినట్లు ఎక్కడికక్కడ సంబరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని అన్నారు.

వారిపై పోలీసులు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రచారం చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది సహజమని ఎన్నికల అధికారులు ప్రకటించే వరకు కూడా సహనం లేకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గెలుపు ఓటమీ అనేది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజలు ఇచ్చే తీర్పును వెలువరించక ముందే తొందరపడి కార్యక్రమాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యక్రమాలు చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రకటనలో కందుల సంధ్యారాణి కోరారు.

Advertisement

Next Story

Most Viewed