- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారికి మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి: పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు
దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లా కేంద్రంలో సోమవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్రలో స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందువులుగా ఉన్న వారితో పాటు హిందువు కాకపోయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు జారీ చేయాలని అన్నారు.
ఇలా రెండు రకాల వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇస్తామని ప్రకటించిన పార్టీకి మద్దతుగా నిలబడి ఓట్లు వేయాలని సూచించారు. ఈ విధంగా చేసినప్పుడే హిందూ ధర్మం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతదేశాలు ఎంతో ప్రాచుర్యం కలిగిన మహోన్నతమైన ప్రదేశాలని వీర హనుమాన్ నుంచి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వరకు ఇక్కడ పుట్టి ఇదే నేలపై నడిచిన వారేనని గుర్తు చేశారు.
హిందువులు పాటించే ఆచారాలు సాంప్రదాయాలు విజ్ఞానంతో కూడుకున్నాయని, అందుకే పద్ధతులను విదేశీయులు, అక్కడి శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారని అన్నారు. ఈ శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి హనుమాన్ భక్తులు, మాలధారణ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.