పెళ్లి కావట్లేదని యువతి ఆత్మహత్యాయత్నం..

by Sumithra |
పెళ్లి కావట్లేదని యువతి ఆత్మహత్యాయత్నం..
X

దిశ, మల్యాల : జగిత్యాలకు చెందిన సిరిగిరి కవిత అలియాస్ ఫరీనా తండ్రి సలీం బుడిగ జంగం (కన్వర్టెడ్ ముస్లిం) (22) సంవత్సరాల యువతి స్టీల్ సామాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. రోజువారిలాగే మల్యాల మండలంలోని నూకపెల్లి గ్రామానికి స్టీల్ సామాన్ అమ్మడానికి వచ్చిన యువతి తన అన్నకు ఫోన్ చేసి తనకు పెళ్లి ఈడు వచ్చిన పెళ్లి కావట్లేదు అని మనస్థాపానికి గురి అయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. సిరిగిరి కవిత అన్నతన చెల్లి చెప్పిన మాటల విని వెంటనే 100కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.

స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు హెడ్ స్టేబుల్ కనకయ్య, కానిస్టేబుల్ తిరుపతి, మహేష్, రాజశేఖర్ ఉన్నపలంగా స్పందించి యువతి ఫోన్ ట్రాక్ చేసి యువతిని కాపాడారు. ఆ యువతిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యువతని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారని మల్యాల ఎస్సై మంద చిరంజీవి తెలిపారు.

Advertisement

Next Story