గూస్ బంప్స్ తెప్పిస్తోన్న చిన్నారి పాడిన అమ్మ పాట.. ఎంత చక్కగా పాడిందో!

by Anjali |
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న చిన్నారి పాడిన అమ్మ పాట.. ఎంత చక్కగా పాడిందో!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయిన ‘‘అమ్మ పాడే జోల పాట’’ అనే సాంగ్ అందరిని ఎంతగానో అలరించింది. ప్రముఖ తెలంగాణ కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ కలం నుంచి జాలువారిన ఈ పాటను సింగర్ జాహ్నవి అద్భుతంగా ఆలపించారు. అయితే ఇదే పాటను ఓ పాప అద్భుతంగా, అచ్చుగుద్దినట్టుగా పాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని పారమిత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఆధ్య అనే అమ్మాయి స్కూలు ప్రారంభం కావడంతో మొదటి రోజున తన క్లాసులో ‘‘అమ్మ పాడే జోల పాట’’ పాటను పాడింది. క్లాస్ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాప పాడిన తీరుకి నెటిజన్లు ప్రశంసలు కురుస్తున్నారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకొని ఏదొక దాంట్లో నైపుణ్యం పొందాలని సూచిస్తూ.. ఆధ్యను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed