టీకా వికటించి ఆస్పత్రిపాలైన చిన్నారి

by Sridhar Babu |
టీకా వికటించి ఆస్పత్రిపాలైన చిన్నారి
X

దిశ, జగిత్యాల టౌన్ : టీకా వికటించడంతో రెండు నెలల పాప ఇన్ఫెక్షన్ కు గురైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. టీకా వేసిన చోట గాయమై పాప ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు సర్జరీ నిర్వహించి అబ్జర్వేషన్ లో ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన జల అనే బాలింత తన పాపకు స్థానిక కొత్తవాడలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో 45 రోజుల టీకా వేయించింది. తర్వాత టీకా వేసిన చోట గడ్డ ఏర్పడి గాయమైంది. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో పది రోజుల క్రితం పాపకు సర్జరీ నిర్వహించారు. ఆశా వర్కర్ నిర్లక్ష్యంగా టీకా వేయడంతోనే తన పాప ఇన్ఫెక్షన్ కు గురైందని పాప తల్లి ఆరోపించింది. ఈ విషయాన్ని ఆశ వర్కర్ దృష్టికి తీసుకెళ్లగా కేసులు పెట్టవద్దని, పాపకు ఏమీ కాకుండా చూసుకుంటానని చెప్పి నేడు మాట మార్చిందని తెలిపారు. ఇప్పుడు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి కేసు పెడితే పెట్టుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పిందని వాపోయారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి చిన్నారి అనారోగ్యానికి కారణమైన ఆశ వర్కర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఆశా వర్కర్​ని వివరణ కోరగా టీకా వేయగా గాయమైన చోట సరిగా ఆయిట్​మెంట్​ పెట్టకపోవడంతోనే ఎక్కువైందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed