మంథనిలో 82.74 పోలింగ్ శాతం నమోదు

by Sumithra |
మంథనిలో 82.74 పోలింగ్ శాతం నమోదు
X

దిశ, మంథని : అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఓటర్లు తమ చైతన్యం ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మంథనిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయింది. నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా 1,95,635 మంది ఓటర్లు (82.74 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 9,85,65 మంది, పురుషులు 9,70,61 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఓటు వేయడంలో ఆసక్తి చూపారు. పెద్దపల్లిలో 81.46 శాతం, రామగుండంలో 68.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తుదివివరాలు వెల్లడించారు. మంథని నియోజకవర్గంలో రామగిరిలో అత్యల్పంగా 75.18 శాతం, అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలో అత్యధికంగా 90.82 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.

రామగిరి మండలంలో 3,67,83 మంది ఓటర్లు ఉండగా 75.18 శాతం, కమాన్పూర్ లో 1,97,60 మంది ఓటర్లకు గాను 84.98 శాతం, పాలకుర్తిలో 8023 మంది ఓటర్లలో 77.77 శాతం, మంథనిలో 4,78,23 మంది ఓటర్లు ఉండగా 83.54 శాతం, కాటారంలో 2,96,24 మంది ఉండగా 81.88 శాతం, మహాదేవపూర్ లో 2,45,89 మంది ఓటర్లు ఉండగా 85.68 శాతం, పలిమెలలో 53,73 మంది ఉండగా 90.82 శాతం, మహాముత్తారంలో 2,01,84 మంది ఓటర్లు ఉండగా 87.95 శాతం, మల్హర్ లో 2,18,93 మంది ఓటర్లు ఉండగా 84.18 శాతం, ముత్తారంలో 2,23,90 మంది ఓటర్లు ఉండగా 83.02 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed