SP Akhil Mahajan : గంజా బాబులు తస్మాత్ జాగ్రత్త..

by Sumithra |
SP Akhil Mahajan : గంజా బాబులు తస్మాత్ జాగ్రత్త..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గంజాయి సేవివించే వారు తస్మాత్ జాగ్రత్త. గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకుంటామని తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సీఐలతో కలసి గంజాయి కిట్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ శాఖ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతామన్నారు.

గంజాయి మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని, ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ గంజాయి తాగే వారిని గుర్తించడానికి అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే, గంజాయి టెస్ట్ లు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకుంటామన్నారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి 8 మందిపై కేసులు నమోదు చేసి, వారి వద్ద 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేస్తామన్నారు. జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed