సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ

by GSrikanth |   ( Updated:2023-04-10 15:03:22.0  )
సారీ.. మరోసారి జరగకుండా చూసుకుంటా.. బండి సంజయ్ అరెస్టుపై కరీంనగర్ సీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు వ్యతిరేకంగా జాగరణ దీక్ష సందర్భంగా గతేడాది జనరి 2వ తేదీ అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేయడంపై పోలీసు కమిషనర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత, మరోవైపు వందల సంఖ్యలో పోగైన కార్యకర్తలను అదుపు చేయాల్సిన అనివార్యతతో బండి సంజయ్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని సీపీ వీ.సత్యనారాయణ గతేడాది జూలై 4న లోక్‌సభ ప్రివిలెజ్ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నారు. అప్పుడు నెలకొన్న పరిస్థితులే ఆయనను అరెస్టు చేయడానికి దారితీశాయని, ఒక ఎంపీగా ఆయన పట్ల తాము మర్యాదపూర్వకంగా వ్యవహరించామని, హక్కులకు భంగం కలగకుండా చూసుకున్నామని, అయినా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆయన అరెస్టుపై జీఏడీ నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, స్థానికంగా శాంతిభద్రతల కోణం నుంచే తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. జరిగిన పరిణామాలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇంకోసారి అలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీగా ఆయన హక్కులకు భంగం కలిగినట్లు ఆయన భావించినట్లయితే దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అంతకుముందు సంఘటన గురించి కమిటీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ‘సారీ’ చెప్పారు. అరెస్టు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల ద్వారా ఎంపీగా బండి సంజయ్‌కు ఏవైనా హక్కుల భంగం జరిగినట్లయితే అది ఆ సమయానికి నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా జరిగిందే తప్ప ఉద్దశపూర్వకంగా జరిగినవి కావని వివరణ ఇచ్చారు.

Read more:

కేసీఆర్ను కట్టేసి ‘బలగం’ సినిమాను చూపించాలి.. బండి సంజయ్

Advertisement

Next Story