- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాన్షీరామ్‌కు భారతరత్న ప్రకటించాలి: గజ్జెల కాంతం
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని బడుగులకు బాసటగా నిలిచిన బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్షీరామ్‌కు భారత రత్న ప్రకటించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ప్రభుత్వాలను కోరారు. ఆదివారం సోమాజిగుడా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాన్షీరాం సోదరిని సత్కరించారు.
అనంతరం కాన్షీరాం సోదరి సువర్ణ కౌర్ మాట్లాడుతూ.. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి కాన్షీరాం అని, ఆయన బీఎస్పీ పార్టీ స్థాపించి నిమ్న వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. ఆయన లాంటి వ్యక్తి దేశంలో మరెవరూ లేరని, ఆయన నిమ్న వర్గాలకు నిత్య స్ఫూర్తి అని తెలిపారు. ఆయన బాటలో నడవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓరుగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.