- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలయా..నిజమా..! కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చామా?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతుండటంతో.. కేసీఆర్ ఇంటి నుంచి గులాబీ నేతలకు ఫోన్లు వెళ్తున్నాయి. గులాబీ బాస్ వద్దకు రావాలని, మాట్లాడి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కలయా..నిజమా? అని పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ కోసం రోజులు, నెలల తరబడి వేచి చూసినా దొరికేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారం చేజారగానే బాస్‌కు ఇప్పుడు గుర్తుకొచ్చామా? అని చర్చించుకుంటున్నారు. మొదటి నుంచీ కేసీఆర్ తీరు ఇలాగే ఉంటే బాగుండేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉంటున్నారు.అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.అయితే, ఎమ్మెల్యేలు,నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంతో వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.అందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,సీనియర్ నేతలకు ఫోన్ చేస్తున్నారు.ఫాంహౌజ్‌కు వచ్చి కలిసి పోవాలని సూచిస్తున్నారు.ఏ రోజు ఎవరు రావాలనే షెడ్యూల్ సైతం ఫిక్స్ చేసి మరీ పిలుస్తున్నట్టు సమాచారం.వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది.అధికార పార్టీ ఏదో ఒక రకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని, వాటికి లొంగొద్దని, ధైర్యంగా ఉండాలని చెబుతున్నట్టు సమాచారం.అంతేకాదు వచ్చిన వారితో కలిసి లంచ్ చేయడం,సుదీర్ఘంగా చర్చిస్తుండటం కొసమెరుపు.
అధికారంలో ఉన్నప్పుడు ఇలా..
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నేతలకు సైతం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనేది బహిరంగ సత్యం. ఆ పార్టీ నేతలే పలుమార్లు అధినేత తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రగతిభవన్ నుంచి పిలుపు కోసం నెలల తరబడి ఎదురుచూసేవారమని,కాలం గడిచిపోయేది కానీ పిలుపు మాత్రం రాకపోయేదని చెప్పేవారు.దీంతో నాయకులు,కేడర్ పార్టీకి దూరమయ్యారని పేర్కొంటున్నారు.ఇప్పుడు ఉన్నట్టుగా, మొదటి నుంచి ఇదే ధోరణిని కేసీఆర్ కొనసాగిస్తే పార్టీకి ప్రస్తుతం ఇటువంటి గడ్డుకాలం వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా మార్పు మంచి దేననే పేర్కొంటున్నారు.
కట్టడి చేయగలరా?
అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో పార్టీ కేడర్ నైరాశ్యంలో ఉంది.దీనికి తోడు ఎమ్మెల్యేలు,కీలక నాయకులు పార్టీ మారుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు అధినేత ఎలాంటి వ్యూహన్ని అనుసరిస్తారనేది కీలకంగా మారింది.పార్టీ కమిటీలు వేయకపోవడం,ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నేతలకు గుర్తింపు ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ మార్పుకోసం ఇప్పటికే ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు.ఈ తరుణంలో కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు? ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటాలు చేస్తారు? నాయకుల్లో ఎలాంటి ధైర్యం కల్పిస్తారు? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.