- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PC Ghosh: పొంతనలేని సమాధానాలు.. ఇంజనీర్లపై పీసీ ఘోష్ సీరియస్!
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది. మంగళవారం ఓపెన్ కోర్టు విచారణకు సీడీఓ మాజీ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డిజైన్లలో మార్పులు చేర్పులు, లొకేషన్ల విషయంలో ఇంజనీర్లపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యారేజీ డిజైన్లు అప్రూవ్ అయ్యాక డిజైన్లు మార్చారా? డిజైన్లు అప్రూవల్ చేసే ముందు రూల్స్ పాటించారా? హైపర్ కమిటీ రూల్స్ పాలో అయ్యారా లేదా? వంటి ప్రశ్నలను కమిషన్ సంధించింది. మేడిగడ్డ లొకేషన్ మారలేదని, సీడీవో, ఎల్ అండ్ టీ మేరు వేరుగా డిజైన్లు తయారు చేసి ఒకే దగ్గర ఫైనల్ చేసినట్లు ఇంజినీర్లు కమిషన్ కు తెలియజేసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంజినీర్ల తీరుపై జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.