Kadambari Jatwani: సీనియర్ ఐపీఎస్‌లకు మరో బిగ్ షాక్.. మరోసారి కాదంబరి జత్వానీ ఫిర్యాదు

by Shiva |
Kadambari Jatwani: సీనియర్ ఐపీఎస్‌లకు మరో బిగ్ షాక్.. మరోసారి కాదంబరి జత్వానీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఫేక్ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిన విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా, డీసీసీ విశాల్ గున్ని, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులపై తాజా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె గురువారం రాత్రి విజయవాడ సీపీ కార్యాలయానికి చేరకుని ఏసీపీ స్రవంతి రాయ్‌కి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫేక్ కంప్లయింట్ ఆధారంగా అధికారుల ఆయనతో కలిసి ఫోర్జరీ పత్రాలతో తనను, తల్లిదండ్రులపై అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ అంటూ తనను మానసికంగా వేధించారని, ముంబైలో నమోదైన కేసు వాపస్ తీసుకోవాలంటూ భయభ్రాంతులకు గురి చేశారని జత్వానీ ఆరోపించారు. ఈ క్రమంలో సదరు ఐపీఎస్ ఆఫీసర్లు, వైసీపీ నాయకుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

Advertisement

Next Story