- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్న నాకు ఎవరో తెలియదు: కేఏ పాల్
దిశ,తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాన్ని ప్రశ్నించి నందుకు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారని, ఆయన ఎఫ్ఐఆర్ కాపీ చదివితే టాలీవుడ్ సినిమాలా ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిని అరెస్టులు చేస్తున్నారని, తీన్మార్ మల్లన్న తనకు ఎవరో తెలియదని, కేవలం రెండు సార్లు ఆయనను కలసినట్లు గుర్తుచేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న టీం పోలీస్‌లను చితబాది.. చంపడానికి ప్రయత్నం చేశారని, ఎఫ్ఐఆర్‌లో సినిమాను తలపించేలా ఉందని తెలిపారు. తనపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కేసులు పెట్టించారని, చంపాలని కూడా కేసీఆర్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. నా ప్రాణాలైన వదులుతా కానీ అభివృద్ధి కోసం, సమస్యలపై నిరంతరం పోరాడుతా.. అని చెప్పారు. దేశంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలకు న్యాయం చేయని ప్రభుత్వాలు మనకెందుకు? అని నిలదీశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పంచాంగం ట్వీట్, మంత్రి కేటీఆర్ పంచాంగం ట్వీట్ చేసి.. ఎవరి డప్పు వాళ్లు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. వారు ఇద్దరు మాట్లాడింది కరెక్టేనని.. బాయ్ బాయ్ కేసీఆర్.. బాయ్ బాయ్ మోడీ అని ప్రజలు అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు మోసపోయారని, కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని మండిపడ్డారు. అభివృద్ధి కోసం ఎవరితో నైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజాశాంతి పార్టీలో చేరాలని, ఇదే మన చివరి ఎలక్షన్ అని, తెలంగాణను అభివృద్ధి చెద్దామని పిలుపునిచ్చారు. మార్చి 27 నుంచి 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌లు ఏర్పాట్లు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : విద్యార్థులకు ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి