‘కాంగ్రెస్‌ది జన గర్జన కాదు.. కుల గర్జన, స్వార్థ గర్జన, అవినీతి గర్జన’

by GSrikanth |   ( Updated:2023-07-02 12:13:59.0  )
‘కాంగ్రెస్‌ది జన గర్జన కాదు.. కుల గర్జన, స్వార్థ గర్జన, అవినీతి గర్జన’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సభ ‘జన గర్జన’ కాదని, కుల గర్జన, స్వార్థ గర్జన, కుటుంబ గర్జన, రెడ్డి గర్జన, అవినీతి, అక్రమ గర్జన అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సభకు ఖర్చు పెట్టడానికి పొంగులేటికి వంద కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పొంగులేటిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రజా యుద్దనౌక గద్దర్ పార్టీ పెట్టి మళ్లీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారని మండిపడ్డారు.

గద్దర్ ‘బానిసలారా బయటికి రండి’ అంటూ గద్దర్ పాట రాశారని, కానీ నేడు గద్దరే బానిస లాగా అయ్యారని, అలాంటి వారే బానిస అయితే ఇంకా ఏం చెప్పాలని అన్నారు. కుటుంబ పాలన కుల పాలన అంతం చేయాలంటే.. అంబేద్కర్ ఫూలే ఆశయాలను నెరవేర్చాలంటే అవినీతి పాలనకు, రెడ్డి పాలనను అంతం చేయాలన్నారు. 54 ఏళ్ల గాంధీ కుటుంబ పాలనలో అవినీతి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని వెల్లడించారు.

Read More..

ఖమ్మం సభకు హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ

Advertisement

Next Story