- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ KA పాల్ సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ వారంలో సికింద్రాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నానని, దమ్ముంటే ఆపుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సవాల్ విసిరారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ వారు మందు పంచి, వందలు వేలు ఖర్చు చేస్తే వారికి జనం వస్తారని, కానీ ప్రజాశాంతి పార్టికి ఆవేమి అవసరం లేదన్నారు. ప్రజల హృదయాల్లో కేఏపాల్ ఉన్నారని, కుటుంబ, అవినీతి పాలన పోవాలంటే పాల్ రావాలి.. పాలన మారాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదని మండిపడ్డారు. ప్రజలు రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డి కావాలా..? బీసీ ముఖ్యమంత్రిగా తాను కావాలా..? అవినీతి కేసీఆర్ పాలన కావాలా తేల్చుకోవాలన్నారు. ఈ వారంలో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కూడా తనతో పాదయాత్ర చేయాలని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ అప్పు తీర్చి అభివృద్ధి చేసే సత్తా తనకు మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు.