- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: జనసేన పార్టీ టీడీపీతో పొత్తులు లేకుండా విడిచి పెడితే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వెయ్యికోట్ల ఆఫర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం కేఏపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2011 కాంగ్రెస్ పార్టీలో ప్రజా రాజ్యం పార్టీలో వీలినం అయినట్లు బీఆర్ఎస్‌లో విలీనం అయితే 5 వేల కోట్ల ఆఫర్ సీఎం కేసీఆర్ ఇచ్చారని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టీడీపీని అందుకే విడిచిపెట్టారని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజా రాజ్యం పార్టీ విలీనం అవుతుందని తానే ముందుగా చెప్పినట్లు గుర్తు చేశారు. 2014 నుంచి జనసేన పార్టీ దాదాపు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజీ స్టార్ కాకపోతే.. కేసీఆర్ ఆఫర్ తీసుకోకుండా.. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ఒంటరిపోరాటమే చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరినైనా కొంటారని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే కుటుంబ పాలనను విడిచి, ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.