- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఏ పాల్ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆమరణ నిరహార దీక్ష
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను దోచుకున్నది చాలక కేసీఆర్, ఆయన కుటుంబం దేశం మీద పడుతున్నదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. అక్టోబర్ 2న జరగాల్సిన ప్రపంచ పీస్ ర్యాలీకి టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. కేసీఆర్ లాంటి దుర్మార్గమైన వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు. పీస్ మీటింగ్ కు ప్రముఖలు వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండేదని, కానీ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతిపిత అయితే కేసీఆర్ కూడా రాష్ట్రానికి జాతిపిత అని రాసుకోవడం సిగ్గనిపించడం లేదా అని దుయ్యబట్టారు.
తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావులు జాతీయ పార్టీ పెట్టి దేశాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కేసీఆర్ చేతిలో బానిసలుగా వాడబడటం బాధాకరం అని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. కేసీఆర్ లో ఉన్న రావణాసురుడు చనిపోయి రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు బాగుపడాలని తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నాన్నారు. మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలిపునిచ్చారు. 1200 మంది అమరవీరులు ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప మరెవరైనా బాగుపడ్డారా? అని ప్రశ్నించారు. తాను బతికున్న లేకున్నా మునుగోడు ప్రజలు మాత్రం సరైన తీర్పు ఇవ్వాలని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ దరిద్ర తెలంగాణ చేశారని మండిపడ్డారు.