ఇంగ్లీష్‌పై పట్టు లేకుండా కాళేశ్వరం సీఈ ఎలా అయ్యారు?.. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై కమిషన్ సీరియస్

by Gantepaka Srikanth |
ఇంగ్లీష్‌పై పట్టు లేకుండా కాళేశ్వరం సీఈ ఎలా అయ్యారు?.. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై కమిషన్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) కుంగుబాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. శనివారం కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తారా? అని మండిపడ్డారు. అయోమయంలో విచారణకు వచ్చి.. తమను అయోమయంలోకి నెట్టొద్దని హెచ్చరించారు.

అయితే మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ పైల్స్‌ను సీడీఓ సీఈ సూచించారని నల్లా వెంకటేశ్వర్లు సమాధానం ఇవ్వడంతో మండిపడ్డారు. తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని జస్టిస్ పీసీ ఘోష్ చెప్పారు. దీంతో తన సమాధానాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు. తగిన దస్త్రాలు సమర్పిస్తే సవరించుకునే అవకాశం ఇస్తామని అన్నారు. తనకు ఇంగ్లీష్‌పై పూర్తిగా పట్టులేదని వెంకటేశ్వర్లు చెప్పడంతో కమిషన్ మరోసారి సీరియస్ అయింది. ఇంగ్లీష్ భాషపై పట్టులేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పనిచేశారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed