ప్రైవేటు ఆసుపత్రిలో పసికందు మృతి...

by Kalyani |
ప్రైవేటు ఆసుపత్రిలో పసికందు మృతి...
X

దిశ, భైంసా: బైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలంలోని రాజురా గ్రామానికి చెందిన ఆనంద అనే గర్భిణీ నీ గత రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా, అదే రోజు పండంటి ఆడపిల్లను ప్రసవించిందనీ, బరువు తక్కువగా ఉండడంతో ఎన్.ఐ.సి.యు లో ఉంచారనీ, శనివారం ఉదయం శిశువు శరీరం నీలం రంగులోకి మారి తీవ్ర అస్వస్థతకు గురి కాగా, దీంతో వైద్యడు కాపాడే ప్రయత్నం చేసి, పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందిందని వాపోయారు. శిశువు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శిశువు మృతి కి డాక్టర్ తో పాటు వైద్య సిబ్బంది కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు మృతిపై డాక్టర్ ని వివరణ కోరగా.. సాధారణంగా శిశువును పడుకోబెట్టి పాలు తాగించడం ద్వారా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, మిల్క్ ఆస్పిరేషన్ వల్లనే శిశువు మృతి చెందినట్లు వైద్యుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story