హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకోవద్దు

by Sridhar Babu |
హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకోవద్దు
X

దిశ, సికింద్రాబాద్ : హైడ్రా వేధింపులతో ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, జీవించి పోరాడాలని సూచించారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువు బఫర్ జోన్ లో హైడ్రా వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ బుచ్చమ్మ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సందర్శించారు. అనంతరం స్థానికంగా ఉన్న రోగుల బంధువులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైడ్రా కూల్చివేతలను తక్షణమే మానుకోవాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే వారికి అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.

నలభై ఏళ్లుగా అన్ని రకాల పన్నులు కడుతూ జీవిస్తున్న వారి ఇళ్లను నేలమట్టం చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ్రయులను చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పేదల ఇళ్లను తీసుకోవాలనుకుంటే వారికి నష్టపరిహారం చెల్లించి, రూ. 5 లక్షలు జీవనోపాధికి చెల్లించాలని తెలిపారు. ముఖ్యమంత్రిగా పేదలకు సహాయం చేయాల్సింది పోయి కన్నీరు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో కనీస మందులు కరువయ్యాయని, జ్వరం, కడుపునొప్పి, గ్యాస్ టాబ్లెట్స్, సిరఫ్ లు కూడా లేవన్నారు. రాష్ట్రంలో నేడు కరోనా, డెంగ్యూ, మలేరియా , చికెన్ గున్యా వంటి వ్యాధులతో లక్షలాదిమంది బాధపడుతున్నారని, దానిని వదిలేసి ఇళ్లు కూల్చివేయడం సరికాదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed